తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''ఆర్ఆర్ఆర్'లో ఆ సీక్వెన్స్.. ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు' - RRR trailer

RRR movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఓ సీక్వెన్స్​ గురించి రాజమౌళి అదిరిపోయే రేంజ్​లో ఎలివేషన్ ఇచ్చారు. ఆ సన్నివేశాలు వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం కూడా ఆపేస్తారని ఆయన అన్నారు. ఇంతకీ ఆ సీక్వెన్స్ ఏమై ఉంటుందో?

RRR movie
రాజమౌళి రామ్​చరణ్ ఎన్టీఆర్

By

Published : Jan 1, 2022, 3:20 PM IST

RRR rajamouli: 'ఆర్ఆర్ఆర్' మళ్లీ వాయిదా పడటం దాదాపు ఖరారైపోయింది. కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 1 అని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా ఆంక్షలు, ఒమిక్రాన్ కేసులు పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే సినిమా ఎప్పుడు రిలీజైనా సరే అంచనాలు ఏమాత్రం తగ్గవు. ఎందుకంటే అక్కడ ఉన్నది డైరక్టర్ రాజమౌళి కాబట్టి.

ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్​ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇప్పుడు అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు దర్శకుడు రాజమౌళి.. సినిమాలోని మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ టీమ్​తో సల్మాన్​ఖాన్, కరణ్​జోహార్

ముంబయిలో జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను డిసెంబరు 31న రాత్రి ప్రసారం చేశారు. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ.. "ఇప్పటివరకు టీజర్, ట్రైలర్​లో లేని ఓ సీక్వెన్స్ సినిమాలో ఉంది. సెకండ్ హాఫ్​లో దానిని చూసి మీ ప్రతి నరం టైట్​గా మారుతుంది. ఈ విషయం నేను కచ్చితంగా చెబుతున్నా. ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు మీరు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు. మీ గుండె గట్టిగా కొట్టుకుంది" అని చెప్పారు.

RRR postponed: దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details