అభిమానులు(RRR movie release date) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. పరిస్థితి అనుకూలంగా ఉండి ఉంటే ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడం వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' (RRR release date) రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8 లేదా 12న ఈ మూవీని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుందట! ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా, ఇప్పటికే సంక్రాంతికి పవన్ కల్యాణ్ 'భీమ్లానాయక్'(pawan kalyan bheemla nayak cast), మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట', ప్రభాస్ 'రాధేశ్యామ్' బెర్త్ ఖరారు చేసుకున్నాయి. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' కూడా సంక్రాంతి లిస్టులో చేరడం వల్ల పోరు ఆసక్తికరంగా మారనుంది.