బాహుబలి2 తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం విడుదల ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మూవీ ప్రారంభించినప్పటి నుంచి ఏదో రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది చిత్ర బృందం.
ఇప్పటికే రామ్చరణ్, ఎన్టీఆర్ గాయపడి షూటింగ్కు విరామం తీసుకున్న తెలిసిందే. ఇటీవల సైరా ప్రచార కార్యక్రమాల కోసం రామ్చరణ్ మరోసారి బ్రేక్ తీసుకున్నాడు. తారక్ కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా షూటింగ్కు విరామం తీసుకొవడం వల్ల సినిమా మళ్లీ ఆగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ పక్కన హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.