చరణ్ నువ్విస్తే విషమైనా తాగుతా: ఎన్టీఆర్ RRR movie promotions: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్‌లు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా చిత్రబృందం షేర్ చేసింది.
సరదా సరదాగా సాగే ఈ వీడియోలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఈ క్రమంలోనే జక్కన్న, ఎన్టీఆర్‌లను రామ్‌చరణ్ కాఫీ తాగుతారా అని అడగ్గా.. నాకు వద్దు అని రాజమౌళి చెప్పారు. ఎన్టీఆర్ మాత్రం.. నవ్వు ఇస్తే కాఫీ ఏంటి విషం కూడా తాగుతా చరణ్ అని అని సరదా సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. 'ఆర్‌ఆర్‌ఆర్' సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి స్వరాలందించారు. కొవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మార్చి 25న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదీ చూడండి:
డేట్ ఫిక్స్.. 'భీమ్లానాయక్' ఓటీటీ రిలీజ్ అప్పుడే..