RRR Movie Promotions: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్ల స్పీడు పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా తారక్, చెర్రీలను సంగీతదర్శకుడు కీరవాణి ఇంటర్వ్యూ చేశారు. ఇందులో హీరోలిద్దరూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చరణ్‌కు బాగా మతిమరుపు ఎక్కువ అని, అందరి పేర్లు మరచిపోతుంటాడని, తారక్ అని పిలువకుండా కారక్ అని పిలుస్తుంటాడని ఎన్టీఆర్ చెప్పాడు.(నవ్వుతూ)
కీరవాణి- మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు?
తారక్- నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట పాడిన మోహన భోగరాజు వాయిస్ అంటే చాలా ఇష్టం. గీతామాధురి కూడా అద్భుతంగా పాడుతుందని, తాను పాడిన అఖండ సినిమాలో జై బాలయ్య పాట చాలా ఇష్టం.
చరణ్-నాకు మోహన భోగరాజు, మంగ్లీ వాయిస్‌లు చాలా ఇష్టం.
కీరవాణి- యాంకర్ సుమకు సినిమాలో ఏ పాత్ర ఇస్తే బాగుంటుంది?
తారక్- సుమ ఎప్పుడూ నోరేసుకుని పడిపోతుంది. ఆమెను చూసిన ప్రతిసారి ఆమె సూర్యకాంతం చేసిన గయ్యాలి అత్త పాత్ర గుర్తొస్తుంటుంది. నాయనమ్మ, అమ్మమ్మ లాంటి ముసలమ్మ పాత్ర ఇస్తే బాగుంటుంది.
చరణ్- సుమకు పంచాయతీలు పరిష్కరించే ఊరిపెద్ద పాత్ర ఇస్తే సరిపోతుంది.
కీరవాణి- చరణ్.. మీరు చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నారని విన్నాను నిజమేనా?