RRR postponed: ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడిన 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మరోసారి మారింది. జనవరి 7న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం లేదని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తనపై ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.
'ఆర్ఆర్ఆర్' సినిమా మళ్లీ వాయిదా
17:02 January 01
ట్విట్టర్ వేదికగా వెల్లడి
2018 చివరిలో అధికారికంగా ప్రకటన వచ్చిన ఈ సినిమాను తొలుత 2020 జులై 30న విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత 2021 జనవరి 7వ తేదీకి మార్చారు. ఆ తర్వాత కరోనా ప్రభావం, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల అక్టోబరు 13న థియేటర్లలోకి తీసుకొస్తామని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తామని చెప్పడం సహా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రచారంతో హోరెత్తించారు. అయితే ఒమిక్రాన్ కేసులు, పలు రాష్ట్రాల్లో ఆంక్షలు, థియేటర్లు మూసివేత.. ఇలా రకరకాల కారణాల వల్ల సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
ఇవీ చదవండి:
- ''ఆర్ఆర్ఆర్'లో ఆ సీక్వెన్స్.. ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు'
- 'ఆర్ఆర్ఆర్'లో ఆ ఇద్దరివి గెస్ట్ రోల్స్: రాజమౌళి
- 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 65 రాత్రులు
- 'రాజమౌళిని నమ్మి రూ.1000 కోట్లయినా పెట్టొచ్చు'
- 'ఆర్ఆర్ఆర్'లోని ప్రతి సీన్ మళ్లీ చేసేందుకు రెడీ: ఎన్టీఆర్
- రాజమౌళి డ్రీమ్‌ప్రాజెక్ట్ 'మహాభారతం'లో చరణ్-ఎన్టీఆర్