తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​, మహేశ్​ సినిమా అప్డేట్స్​​.. 'ఆర్​ఆర్​ఆర్'​, 'కేజీఎఫ్​ 2' రికార్డ్స్​ - కేజీఎఫ్ 2 ట్రైలర్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో పవన్​కల్యాణ్​ 'హరిహరవీరమల్లు', మహేశ్​బాబు-త్రివిక్రమ్​ కాంబో సినిమా, 'ఆర్​ఆర్​ఆర్'​, 'కేజీఎఫ్​ 2' రికార్డుల వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Mar 28, 2022, 7:34 PM IST

Updated : Mar 28, 2022, 8:25 PM IST

Hariharaveeramallu movie: ఇటీవలే 'భీమ్లానాయక్'​తో సూపర్​హిట్ అందుకున్నారు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​. ఇప్పుడు తన తదుపరి చిత్రం 'హరిహర వీరమల్లు' బ్యాలెన్స్​ షూట్​ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. దీనికోసం కొన్ని భారీ సెట్​లను తీర్చిదిద్దుతున్నారు. లెజెండరీ ఆర్ట్​ డైరెక్టర్​ తోట థరణి ఆధ్వర్యంలో ఈ సెట్స్​​​ నిర్మాణం జరుగుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్వీట్​ చేసింది. పవన్​, తోటథరణి కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను పోస్ట్​ చేసింది. ఇక ఈ మూవీకి క్రిష్​ దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్​ హీరోయిన్​గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాన్​ఇండియా స్థాయితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పవన్​ కల్యాణ్​ తోటథరణి

Mahesh Trivikram movie: సూపర్​స్టార్​ మహేశ్​బాబు-దర్శకుడు త్రివిక్రమ్​ కలయికలో రాబోతున్న సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇటీవలే ఈ సినిమాలో మలయాళ స్టార్​ మోహన్​లాల్​ నటిస్తున్నారని ప్రచారం సాగగా.. ఇప్పుడు ఆ పాత్రలో మరో హీరో పేరు వినిపిస్తోంది. కన్నడ సూపర్​ స్టార్​ ఉపేంద్ర నటిస్తున్నారని వినికిడి. మహేశ్​కు అన్నయ్యగా ఆయన కనిపించనున్నారట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్​గా పూజాహెగ్డే నటించనుంది. ఏప్రిల్​ నుంచి షూటింగ్​ ప్రారంభించాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారు. అంతకుముందు త్రివిక్రమ్​ దర్శకత్వంలో వచ్చిన 'సన్​ ఆఫ్​ సత్యమూర్తి' సినిమాలోనూ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు.

RRR movie overseas collections: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్​ఆర్​ఆర్'​ బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త బెంచ్​ మార్క్​ను సెట్​ చేసింది. ఓవర్సీస్​లో రూ.122కోట్ల గ్రాస్​ కలెక్ట్​​ చేసినట్లు అక్కడి​ డిస్ట్రిబ్యూటర్​ ఫార్స్​ఫిల్మ్​ సోషల్​మీడియా ద్వారా ట్వీట్​ చేసింది. ​ఇక ఈ సినిమాలో అజయ్​దేవగణ్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలు పోషించారు.

ఆర్​ఆర్​ఆర్​

KGF 2 trailer records: కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ 2' ట్రైలర్​ కూడా సోషల్​మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109మిలియన్లకు పైగా వ్యూస్​ను దక్కించుకుంది. హిందీ(51మిలియన్లు), తెలుగు(20),కన్నడ(18), తమిళం(12), మలయాళం (8) మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

కేజీఎఫ్​ 2 ట్రైలర్​ రికార్డ్స్​

ఇదీ చూడండి: ఒక్కో ఇన్​స్టా పోస్ట్​కు సమంత సంపాదన ఎంతంటే?

Last Updated : Mar 28, 2022, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details