NTR: ప్రాంతీయ సినిమాను పాన్ఇండియాగా మలిచిన ఘనత.. దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కే దక్కుతుందన్నారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. గతేడాది ముంబయిలో జరిగిన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' ఈవెంట్లో ఈమేరకు వ్యాఖ్యానించారు.
"చరిత్రలో మనం పేజీలు తిరగేస్తే.. ప్రాంతీయ సినిమా హద్దులను చెరిపేసి.. ఇండియన్ సినిమాగా మార్చిన ఘనత రాజమౌళి, కరణ్ జోహార్‌కే దక్కుతుంది. చరిత్రలో మిమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కో చేత్తో ఎప్పుడూ చప్పట్లు కొట్టలేము. ఈ హద్దులను చెరిపేసినందుకు ధన్యవాదాలు. మేము ఇంత నమ్మకంగా ఈ వేదికపై నిలబడ్డామంటే మీ (కరణ్) వల్లే"
-ఎన్టీఆర్, నటుడు
ఇక రామ్‌చరణ్‌తో ఒకే వేదికపై ఉండటం ఎంతో ప్రత్యేకమని తారక్ చెప్పారు. అతడి గురించి మాటల్లో చెప్పడం కష్టమని అన్నారు. ఒక సోదరుడిలా, గైడ్‌లా ఉన్న ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.