తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​'లో సరికొత్త ప్రయోగానికి తారక్​ రెడీ..! - rrr movie latest info

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. భారీ బడ్జెట్​తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు జూనియర్​ ఎన్టీఆర్​.

సరికొత్త ప్రయోగానికి తారక్​ రెడీ..!

By

Published : Sep 5, 2019, 6:31 AM IST

Updated : Sep 29, 2019, 12:09 PM IST

ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న భారీ బడ్జెట్​ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. బాహుబలి సిరీస్​ తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న సినిమా కావడం వల్ల దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్​గా నటించడం వల్ల ఈ కాంబినేషన్​పై అభిమానుల్లో మరింత క్రేజ్​ ఏర్పడింది. అయితే ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రయోగం చేస్తున్నాడట ఎన్టీఆర్​.

ఈ సినిమా తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వెర్షన్లలో ఏకకాలంలో విడుదల కానుంది. అయితే ఇంత ప్రతిష్ఠాత్మక చిత్రానికి తారక్ అన్ని భాషల్లో తానే స్వయంగా​ డబ్బింగ్​ చెప్పుకొనేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే ఈ భాషలు నేర్చుకునే పనిలో యంగ్​ టైగర్​​ ఉన్నట్లు సమాచారం. మరి చరణ్‌ కూడా ఇదే తరహా ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.

ఆర్​ఆర్​ఆర్​లో తారక్​, చరణ్​, రాజమౌళి

దాదాపు రూ.350 కోట్లతో సినిమా రూపొందుతోంది. బాలీవుడ్‌ నుంచి అజయ్‌ దేవగణ్, ఆలియా భట్​, తమిళం నుంచి సముద్రఖని తదితరులు ఇందులో నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ కథ సమకూర్చగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి...సంగీత దర్శకుడికి సాయిధరమ్​​ తేజ్​ సాయం..!

Last Updated : Sep 29, 2019, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details