'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ రిలీజైంది. రామ్చరణ్, ఎన్టీఆర్.. ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఈ పాటకు కీరవాణి సంగీతమందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు.
కల్పిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు.