ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది.'ఆర్‌ఆర్‌ఆర్'లో ఈ హీరోకు జోడీగా ఎవరు నటిస్తారన్న సందేహాలకు తెరపడింది. ఒలివియా మోరిస్ అనే నటి తారక్‌కు జోడీగా నటించనుంది. ఈమె జెన్నిఫర్ అనే పాత్రలో కనిపించనుంది. త్వరలోనే చిత్రబృందంతో కలిసి షూటింగ్లో పాల్గొననుంది. అలాగే విలన్‌గా రే స్టీవెన్సన్ను ప్రకటించారు. ఇతడు స్కాట్ అనే బ్రిటీషర్ పాత్రలో కనిపించనున్నాడు.
'ఆర్‌ఆర్‌ఆర్': తారక్‌తో హాలీవుడ్ నటి - 'ఆర్‌ఆర్‌ఆర్': తారక్ సరసన హాలీవుడ్ నటి
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం నుంచి అప్డేట్ విడుదల చేసింది చిత్రబృందం. ఒలివియా మోరిస్ అనే నటి ఎన్టీఆర్‌కు జోడీగా నటించనుంది. ఈమె జెన్నిఫర్ అనే పాత్రలో కనిపించనుంది.
ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న'ఆర్‌ఆర్‌ఆర్'... శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమా ప్రారంభమై తాజాగా ఏడాది పూర్తి కాగా. దాదాపు 70శాతం చిత్రీకరణ అయిపోయిందని ప్రకటించింది నిర్మాణ సంస్థ.
ఈ చిత్రంలో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని ఇటీవల రామ్‌చరణ్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.