మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల ఆధారంగా అల్లుకున్న ఓ ఫిక్షనల్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో భీమ్ పాత్రను తారక్ పోషిస్తుండగా.. అల్లూరి పాత్రలో చరణ్ దర్శనమివ్వబోతున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.
''ఆర్ఆర్ఆర్' అలాంటి చిత్రం కాదు' - రామ్ చరణ్ వార్తలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది చిత్రబృందం.
తాజాగా ఈ చిత్రం టైటిల్ లోగోతో తయారు చేసిన ఒక నాణెం లాంటి లుక్‌ను చిత్రబృందం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఇందులో భీమ్.. అల్లూరి ఏదో గొప్ప పనికోసం చేతులు కలిపినట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ "ఈ చిత్రం.. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలిసి స్వాతంత్య్రం కోసం పోరాడారని చెబుతుందా?" అని ప్రశ్నించగా.. అసలిది దేశభక్తి చిత్రం కాదని చెప్పి ఆశ్చర్యపరిచింది చిత్రబృందం. "భీమ్.. అల్లూరి కలుస్తారు. వాళ్లిద్దరూ చేతులు కలుపుతారు. కానీ, మీరన్నట్లు వాళ్లు సినిమాలో స్వాతంత్య్రం కోసం పోరాడరు. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా పూర్తిగా కల్పితమైంది. దేశభక్తి చిత్రం కాదు" ఆ నెటిజన్‌కు బదులిచ్చింది 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్.