RRR Movie Interview: 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని అనేక సన్నివేశాలకు సంబంధించిన సీక్రెట్లు చెప్పారు దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్.. పులితో, రామ్‌చరణ్ 2వేల మంది ఆర్టిస్టులతో చేసిన సన్నివేశాల వెనకున్న రహాస్యాలను విప్పారు జక్కన్న. చిత్ర ప్రచారంలో భాగంగా 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
"కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసి చాయ్ తాగితే ఎలా ఉంటుంది? కర్ణుడికి, కృష్ణుడికి మధ్య స్నేహం ఉంటే ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నల నుంచి ఈ కథ వచ్చింది" అని జక్కన్న అన్నారు. సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రాజమౌళి. అవసరమైతే మారువేషంలో వస్తానని చెప్పారు.
రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్'తో తారక్, చరణ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నారు. అల్లూరి సీతారామరాజు (నిప్పు), కొమురం భీమ్ (నీరు)ల స్నేహం గురించి తెలియజేయనున్నారు. 1920లో సాగే ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్లతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన 4వ సినిమాగా, రాజమౌళి- రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందిన 2వ చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్' సినీ ప్రియుల్ని ఊరిస్తోంది.
'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడం వల్ల యావత్ సినీ అభిమానులు 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో కలిసి ముచ్చటించారు జక్కన్న. పూర్తి ఇంటర్వ్యూ మీరూ చూసేయండి..
ఇదీ చదవండి:తారక్‌తో అలా.. చెర్రీతో ఇలా.. 'ఆర్ఆర్ఆర్' కాంబినేషన్లు అదుర్స్!