తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియల్​ టైగర్​తో యంగ్​ టైగర్​..! - rakampuli

ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్' షూటింగ్​ బల్గేరియాలో శరవేగంగా జరుగుతోంది. యాక్షన్​ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ నిజమైన పులితో తలపడనున్నాడని సమాచారం.

'ఆర్​ఆర్​ఆర్' షూటింగ్

By

Published : Sep 10, 2019, 3:35 PM IST

Updated : Sep 30, 2019, 3:24 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​లతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'​. ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్​ జరుపుకొంటోంది. అక్కడ ఎన్టీఆర్​పై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. యంగ్​టైగర్, నిజమైన పులి మధ్య ఫైట్​ను చిత్రీకరిస్తున్నాడట దర్శకధీరుడు.

ఈ సన్నివేశాన్ని శిక్షణ పొందిన ఓ పులితో అత్యంత జాగ్రత్తగా తీయనున్నాడట జక్కన్న. అంతర్జాతీయ ఫైట్​ మాస్టర్స్​ అధ్వర్యంలో షూటింగ్​ పూర్తి చేయనున్నాడట.

ఇదీ చూడండి: 'లుంగిడ్యాన్స్​' పాటకు చిందేసిన బ్రావో, షారుఖ్​

Last Updated : Sep 30, 2019, 3:24 AM IST

ABOUT THE AUTHOR

...view details