తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​'కు కొత్త తలనొప్పులు.. రంగంలోకి మూవీ టీమ్​ - రామ్​చరణ్​

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.​ థియేటర్ల వద్ద ఫ్యాన్స్​ ఓ రేంజ్​లో​ సందడి చేస్తున్నారు. అదంతా బాగానే ఉంది.. కానీ, ఇప్పుడు 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్ర బృందానికి అభిమానుల వల్ల కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. సినిమాను చూసిన ఫ్యాన్స్​​ కొన్ని సీన్లను ఫోన్​లో చిత్రీకరించి సోషల్​మీడియాలో తెగ షేర్​ చేస్తున్నారు. ఇక, మూవీ టీమ్​ రంగంలోకి దిగి వాటిని డిలీట్​ చేయిస్తుంది.

RRR
RRRr

By

Published : Mar 25, 2022, 8:24 PM IST

RRR: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లను ఒకే తెరపై చూసేందుకు ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో కాలం వేచి చూశారు. వారి ఎదురుచూపులకు తగిన ఫలితం 'ఆర్​ఆర్​ఆర్​' శుక్రవారం కనిపించగానే.. థియేటర్లలో హంగామా చేశారు. మరోవైపు సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లిన కొందరి అత్యుత్సాహం 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ పడిన శ్రమనంతటినీ వృథా చేస్తోంది. కొత్త తలనొప్పులను సృష్టిస్తోంది. సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కీలక సన్నివేశాల్ని తమ ఫోన్లలో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. వాటిని చూసినవారంతా 'లైక్‌' కొట్టి, షేర్‌ చేస్తుండడం వల్ల నెట్టింట ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఇదీ ఓ రకంగా పైరసీ కావడం వల్ల చిత్ర బృందం రంగంలోకి దిగింది. ప్రముఖ ఐటీ సంస్థతో కలిసి ఇలాంటి అనధికారిక పోస్ట్‌లన్నింటినీ తొలగిస్తోంది.

కొందరు అత్యుత్సాహంతో ముఖ్యమైన ఘట్టాల్ని సోషల్‌మీడియాలో పంచుకోవటం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పలు చిత్రాల విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించారు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details