ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం నుంచి శుభవార్త వచ్చింది. సామాజిక మాధ్యమాల వేదికగా రేపు (మార్చి 25) ఈ సిినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ మేరకు రాజమౌళి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ప్రస్తుతం కరోనా వైరస్ దృష్ట్యా చిత్రబృందం అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకుల్ని నేను కోరేది ఒక్కటే. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆన్‌లైన్లో మాత్రమే పోస్టర్‌ను ఎంజాయ్ చేయండి. ప్రింట్లు, ఫ్లెక్స్‌లు పెట్టొద్దు.