తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' నుంచి క్రేజీ అప్​డేట్.. ఫొటో ట్వీట్ - RRR LATEST NEWS

చరణ్-తారక్​ల మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. అలానే ఓ ఫొటోను ట్వీట్ చేసింది.

RRR Movie CLIMAX shoot has begun on tuesday
'ఆర్ఆర్ఆర్' నుంచి క్రేజీ అప్​డేట్.. ఫొటో ట్వీట్

By

Published : Jan 19, 2021, 4:15 PM IST

Updated : Jan 19, 2021, 4:53 PM IST

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' టీమ్​ అదిరిపోయే అప్​డేట్ ఇచ్చింది. క్లైమాక్స్ షూటింగ్ మొదలైనట్లు మంగళవారం ట్వీట్ చేసింది. భీమ్-సీతారామరాజు ఒకరి చేతులు ఒకరు మోచేయి వరకు పట్టుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

.

ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారి పాత్రల టీజర్స్​ రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్​గణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య, దాదాపు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది థియేటర్లలోకి 'ఆర్ఆర్ఆర్' వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 19, 2021, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details