తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' కోసం పేరు మార్చుకున్న ఆ సంస్థ - రామ్​చరణ్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'(rrr release date) నుంచి అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ అదేంటి? దాని సంగతేంటి?

RRR glimpse teaser
ఆర్ఆర్ఆర్ మూవీ

By

Published : Oct 29, 2021, 2:13 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'(rrr release date). షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​ దశలో ఉంది. ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్​.. ఈ సినిమా(rrr teaser) కోసం తమ పేరు మార్చుకుంది. రాబోయే కొన్ని నెలల పాటు PV'RRR'గానే థియేటర్లపై పేరు ఉండనుంది. ముంబయి అంధేరీలోని ఓ థియేటర్​లో చిత్ర దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఈ లోగోను ఆవిష్కరించారు.

అయితే ఓ సినిమా కోసం తమ సంస్థ పేరు మార్చుకోవడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఈ ట్రెండ్​ భవిష్యత్తులోనూ మరింతగా ఉండే అవకాశముంది. మన దేశంలోని పీవీఆర్​కు చెందిన 850కి పైగా స్క్రీన్లతో పాటు 70కి పైగా నగరాల్లో ఉన్న 170కి పైగా బిల్డింగ్​లపై PV'RRR' అనే పేరు దర్శనమివ్వనుందని ఆర్ఆర్​ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది.

ఎన్టీఆర్​తో రాజమౌళి

భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్​ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. అల్లూరిగా రామ్​చరణ్(ram charan movies), భీమ్​గా ఎన్టీఆర్ నటించారు. ఆలియా భట్(alia bhatt husband), ఒలీవియా మోరిస్ కథానాయికలు.

అజయ్ దేవ్​గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించగా, ఎస్.ఎస్. రాజమౌళి(rajamouli upcoming movies) దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై రూ.450 కోట్లతో దానయ్య నిర్మించారు. వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి రానుందీ సినిమా.

ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details