RRR movie: ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కు మరో 50 రోజులే ఉందని చెబుతూ చిత్రబృందం కొత్త ఫొటో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా షూటింగ్‌కు సంబంధించిన ఓ పిక్‌ను ట్వీట్ చేసింది.
రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత.
Mahaan trailer: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన చిత్రం 'మహాన్'. సిమ్రన్, సింహా, సనంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 10న నేరుగా ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం, సినిమా ట్రైలర్ విడుదలైంది.