తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెండ్రోజుల పాటు 'ఆర్​ఆర్​ఆర్​' ట్రయల్​ షూట్​! - ఎన్టీఆర్​

హైదరాబాద్​ శివార్లలో రెండు రోజులపాటు 'ఆర్​ఆర్​ఆర్​' ట్రయల్​ షూట్​ జరగబోతుందని సమాచారం. అయితే ఈ చిత్రీకరణలో ప్రధాన తారాగణం పాల్గొనరని తెలుస్తోంది. ఈ ట్రయల్​ షూట్​ విజయవంతమైన తర్వాత పూర్తి స్థాయిలో చిత్రీకరణ మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

'RRR' is going to Trail shoot for two days in the outskirts of Hyderabad
రెండు రోజులపాటు 'ఆర్​ఆర్​ఆర్​' ట్రయల్​ షూట్​!

By

Published : Jun 16, 2020, 6:28 AM IST

తెలంగాణ ప్రభుత్వం షూటింగ్​లకు అనుమతించిన క్రమంలో 'ఆర్​ఆర్​ఆర్​' కోసం రాజమౌళి ట్రయల్​ షూట్​కు సిద్ధమయ్యారని సమాచారం. రెండు రోజులపాటు గండిపేట లేదా హైదరాబాద్​ శివార్లలోని అల్యూమినియమ్​ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన సెట్లలో ట్రయల్​ షూట్​ జరగబోతుందని టాలీవుడ్​ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ షూట్​లో రామ్​ చరణ్​, ఎన్టీఆర్​ పాల్గొనడం లేదని తెలుస్తోంది. వారి స్థానంలో డూప్​లతో చిత్రీకరణ చేయాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్​ చేశారట. ట్రయల్​ షూట్​ విజయవంతమైన తర్వాత హీరోలతో షూటింగ్​ను కొనసాగించాలని యోచిస్తున్నారట. దీని కోసం 50 మంది సిబ్బందిని నియమించనున్నారట. ట్రయల్​ షూట్​ సమయంలో ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని చిత్రబృందం నిర్ణయించిందట.

ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్​ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 'బాహుబలి' విజయం తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది.

ఇదీ చూడండి... పెళ్లికి ముందే శుభవార్త చెప్పేశారు!

ABOUT THE AUTHOR

...view details