దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR Movie). ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె శనివారం సాయంత్రం హైదరాబాద్ వీధుల్లో సందడి చేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్' కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అనురెడ్డితో కలిసి ఆమె శిల్పారామం వెళ్లి వచ్చారు. అక్కడి ప్రకృతి అందాలకు, హస్తకళలకు ఆమె ముగ్ధులయ్యారు. అనురెడ్డితో కలిసి హైదరాబాదీ పానీపూరీని రుచి చూశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. తన రోజు ఎంతో సరదాగా గడిచిందని పేర్కొన్నారు.
RRR movie: హైదరాబాద్ వీధుల్లో హాలీవుడ్ భామ సందడి - ఆర్‌ఆర్‌ఆర్ హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్
'ఆర్‌ఆర్‌ఆర్'లో(RRR Movie) నటిస్తున్న హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ హైదరాబాద్ వీధుల్లో సందడి చేశారు. శిల్పారామం కూడా వెళ్లి వచ్చారు. తన రోజు ఎంతో సంతోషంగా గడిచిందంటూ ఇన్‌స్టాలో ఫొటోలు పోస్ట్ చేశారు.
రామ్‌చరణ్-తారక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం సినీ ప్రియులందరూ ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'దోస్తీ'(RRR Dosti song) పాట విశేషంగా ఆకట్టుకుంది. ఆలియాభట్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, ఎలిసన్ డ్యూడీ, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: RRR: ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ పూర్తి.. రిలీజ్ వాయిదా!