మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. తాజాగా ఈరోజు ఒలివియా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో జెన్నిఫర్ అనే పాత్రలో కనువిందు చేయనుందీ భామ. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఆర్ఆర్ఆర్, ప్రభాస్-నాగ్అశ్విన్ చిత్రాల అప్డేట్స్ ఇవే!
'ఆర్ఆర్ఆర్' నుంచి నటి ఒలివియా మోరిస్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అలాగే ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రం నుంచి ఓ అప్డేట్ వచ్చింది.
ఆర్ఆర్ఆర్, ప్రభాస్-నాగ్అశ్విన్ చిత్రాల అప్డేట్స్ ఇవే!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడిగా మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రాఫర్‌గా డాని సాచెజ్-లొపెజ్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.