'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ విడుదలకు తేదీ ఖరారైంది. నవంబరు 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. 45 సెకన్లపాటు ఈ వీడియో ఉండనుందని చెప్పారు.
శుక్రవారం సాయంత్రమే ఈ గ్లింప్స్ విడుదల చేయాలనుకున్నారు. కానీ కన్నడ హీరో పునీత్‌రాజ్ హఠాన్మరణంతో దానిని వాయిదా వేశారు.
నిజ జీవిత, కల్పిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. నిర్మాణనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది 'ఆర్ఆర్ఆర్'.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పోస్టర్ ఇవీ చదవండి: