బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, ఓ విషయమై క్లారిటీ ఇచ్చింది. గత కొన్నిరోజులుగా 'ఆర్ఆర్ఆర్'(RRR release date), 'గంగూబాయ్ కతియావాడి'(gangubai kathiawadi), 'అటాక్' చిత్రాలు ఓటీటీలో నేరుగా విడుదలవుతాయనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. అవి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీస్తున్న చిత్రాలని పేర్కొంది. వాటిని కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని తెలిపింది.
'ఆర్ఆర్ఆర్'తో పాటు ఆ సినిమాలు థియేటర్లలోనే.. - john abraham attack movie
హిందీ చిత్రసీమలో గతకొన్నిరోజుల నుంచి ఓ వార్త తెగ చర్చనీయాంశమైంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న మూడు సినిమాలను నేరుగా ఓటీటీలోనే రిలీజ్(OTT Releases) చేయనున్నారని అంటున్నారు. దీనిపై ఆ చిత్రాల రిలీజ్ హక్కులు దక్కించుకున్న నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్
'ఆర్ఆర్ఆర్'.. రాజమౌళి దర్శకత్వం తెరకెక్కుతోంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. 'గంగూబాయ్'.. ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ తీస్తున్న చిత్రం. 'అటాక్'(attack movie release date).. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
ఇవీ చదవండి: