తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' ఫస్ట్​లుక్​పై వీడని ఉత్కంఠ! - rrr title poster

'బాహుబలి' సిరీస్​ సూపర్​ హిట్​ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్​.ఆర్​.ఆర్​'. ఇందులో టాలీవుడ్​ స్టార్​ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడం వల్ల సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదలపై ఓ వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

RRR first look surprise from the SS Rajamouli on eve of newyear 2020
'ఆర్​ఆర్​ఆర్' ఫస్ట్​లుక్​పై వీడని ఉత్కంఠ!

By

Published : Dec 29, 2019, 7:01 AM IST

బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా సినీ వర్గాల్లో ఎంత ఆసక్తి కలిగించింది. తాజాగా అదే స్థాయిలో ఇప్పుడు 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' ఫస్ట్‌లుక్‌పై వార్తలు వస్తున్నాయి. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద మల్టిస్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమా ఇది. అందుకే దర్శకధీరుడు రాజమౌళి చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి చిత్రంపై అంచనాలు తారస్థాయికి చేరాయి. ఇందులో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్‌గా తారక్​ నటిస్తున్నారు.

కొత్త ఏడాది సరికొత్తగా...

చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తుండగా... తారక్‌ సరసన ఒలివియా మోరిస్‌ కనువిందు చేయనుంది. ఇప్పటికే సినిమాలోని పలు క్యారెక్టర్లపై క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. అంతేకాకుండా 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఆ తర్వాత సినిమా నుంచి ఎటువంటి అప్‌డేట్‌ లేదు. తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త అంతర్జాలంలో తెగ సందడి చేస్తుంది. వచ్చే ఏడాది మొదటి రోజు నుంచి 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' తరపున ప్రతి పండుగకి ఒక సర్​ప్రైజ్​ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట దర్శక ధీరుడు.

వచ్చే ఏడాది నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న కథానాయకుల ఫస్ట్‌ లుక్‌, టైటిల్​ లోగో విడుదల చేయనున్నారని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మల్టిస్టారర్‌ సినిమా.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details