RRR Movie: టీఎస్ఆర్టీసీ బస్సులో థియేటర్‌కు 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం - ramcharan
19:35 March 25
RRR Movie: టీఎస్ఆర్టీసీ బస్సులో థియేటర్‌కు 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం
RRR Movie: ప్రముఖ నటులు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం నేడు విడుదలైన నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్లారు. చిత్ర యూనిట్ కూడా పలు థియేటర్లలో సినిమాను వీక్షించింది. హైదరాబాద్‌లోని భ్రమరాంబ థియేటర్లో దర్శకుడు రాజమౌళి, నటుడు రామ్‌చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు.
ఇవాళ తెల్లవారుజామున ఉదయం 3గంటలకు బెనిఫిట్ చూసేందుకు చరణ్, రాజమౌళి సహా చిత్రబృందం కారుల్లో కాకుండా టీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్లారు. థియేటర్‌కు భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య వీరు బౌన్సర్ల సాయంతో హాలులోకి వెళ్లాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: