'బాహుబలి'(bahubali) , 'భజరంగీ భాయ్‌జాన్' వంటి అద్భుత చిత్రాలకు కథ అందించి గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్ (vijayendra prasad). ఆయన ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' (RRR), 'సీత' వంటి చారిత్రాత్మక సినిమాలకు కథ అందిస్తున్నారు. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా (Alitho Saradaga)షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే "ఆర్ఆర్ఆర్'లో ఫైట్ కంటతడి పెట్టించిందని ఈ మధ్య చెప్పారు అదేంటది?" అని ఆలీ అడగ్గా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
RRR: ఆ ఫైట్ ఏడిపిస్తుంది.. ఎందుకంటే? - ఆలీతో సరదాగా లేటెస్ట్ ఎపిసోడ్
ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ఆలీతో సరదాగా (Alitho Saradaga). తాజాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (vijayendra prasad) హాజరయ్యారు. పలు విషయాలు పంచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్'(RRR)లోని ఫైట్స్ గురించి వివరించారు.
![RRR: ఆ ఫైట్ ఏడిపిస్తుంది.. ఎందుకంటే? Vijayendra Prasad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11972981-740-11972981-1622519548304.jpg)
"మనం ఫైట్స్ చూస్తా ఉంటే విలన్‌ను హీరో కొడుతుంటే కొట్టు, కొట్టు, నరుకు అంటాం. ఇద్దరు మంచి వాళ్లు కొట్టుకుంటే ఎవరి పక్షాన ఉంటాం?. ఉదాహరణకు ఓ తల్లుంది. ఆమె ఇద్దరు కొడుకులు దెబ్బలాడుకుంటుంటే ఒకరు ఓడిపోవాలని కోరుకుంటదా?. కొట్టుకోవద్దురా అని ఏడుస్తది. అలా మనం ప్రేమించేటువంటి ఇద్దరు సూపర్‌స్టార్స్, ఇద్దరూ మంచివాళ్లే.. పరిస్థితుల ప్రభావాల వల్ల కొట్టుకుంటుంటే మనకు ఏడుపొస్తది. ఫస్ట్ టైమ్ నేను థియేటర్లో ఆ సెన్సేషన్ పీలయ్యా. అయ్యో కొట్టుకుంటున్నారే.. కొట్టుకోవద్దురా అనుకున్నా. ఎన్నిసార్లు చూసిన అనుభూతి అదే వస్తది" అని వివరించారు.