Prabhas Project K: 'ప్రాజెక్ట్ కె' సినిమా పనుల్లో భాగంగా ఆదివారం మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి వెళ్లారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా.. "సాంకేతికతను ప్రకృతి కలిసే చోటు" అంటూ ఆ క్యాంపస్‌ను కొనియాడారు. ఇటీవలే ఈ చిత్రానికి సాంకేతిక సహకారం కావాలని నాగ్ అశ్విన్ కోరగా.. అందుకు సంతోషంగా అంగీకరించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. ఈ క్రమంలోనే ఆయన మహీంద్రా క్యాంపస్‌కు వెళ్లారు. ఈ సినిమాను దేశానికి గర్వకారణంగా నిలిచేలా రూపొందిస్తానన్న తన మాట నిలబెట్టుకునేందుకు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తానని నాగ్ అశ్విన్ అన్నారు.
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ సూపర్‌హీరో రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. దీపికా పదుకొణె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
డాల్బీలో 'ఆర్ఆర్ఆర్'
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. మరో ప్రత్యేకతను సంతరించుకుంది. డాల్బీ సినిమాలో రిలీజ్‌కానున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. డాల్బీ సాంకేతికతతో మంచి విజువల్ సహా అద్భుతమైన సౌండ్‌ను ప్రేక్షకుడు అనుభూతి చెందుతాడు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.
మహేశ్ చేతుల మీదుగా..