తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి - RRR songs

మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని డైలాగ్​ను డైరెక్టర్ రాజమౌళి రివీల్ చేశారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే?

rrr dialogue revealed by rajamouli
ఆర్ఆర్ఆర్ రాజమౌళి

By

Published : Nov 8, 2021, 9:20 PM IST

Updated : Nov 8, 2021, 10:02 PM IST

ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram charan) హీరోలుగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 'ఆర్ఆర్‌ఆర్‌' ఫస్ట్‌ గ్లింప్స్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్‌'లోని ఓ డైలాగ్‌ను రివీల్‌ చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అవుతోంది.

రాజమౌళి

సోమవారం హైదరాబాద్‌లోని ఛాయిస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్‌ కపిల్‌దేవ్‌, దర్శకుడు రాజమౌళి, వైద్యులు రవి తంగరాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'నిర్మాత శోభు యార్లగడ్డ ద్వారా ఛాయిస్‌ ఫౌండేషన్‌ సతీశ్‌ పరిచయం అయ్యారు. పిల్లల్లో కలిగే 90శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయి. ఛాయిస్‌ ఫౌండేషన్‌ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతోంది' అని అన్నారు. చిన్నారుల కోసం పనిచేస్తున్న ఈ సంస్థ 2 కోట్ల రూపాయల చెక్‌ను మాస్ మ్యుచవల్ ఫండ్ తరపున రవి తంగిరాల అందించారు. ఈ క్రమంలో 'ఆర్ఆర్ఆర్‌'లోని ఓ డైలాగ్‌ను రాజమౌళి చెప్పారు.

ఆర్ఆర్​ఆర్ మూవీ

"యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం" అని రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లోని డైలాగ్‌ చెప్పారు. మరి ఈ డైలాగ్‌ సినిమాలో ఎవరు? ఎవరితో అన్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే! ప్రస్తుతం ఈ డైలాగ్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆలియా భట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిస్తే ఏం జరిగిందన్న పాయింట్‌కు ఫిక్షనల్‌ స్టోరీ జోడించి 'ఆర్ఆర్ఆర్‌' తీస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 8, 2021, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details