తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చరణ్-తారక్.. 'ఆర్‌ఆర్​ఆర్‌' వాయిదా పడనుందా?

'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి తాజాగా ట్వీట్​ చేసిన బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్.. విడుదల తేదీ ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది. అనుకున్న తేదీకి వస్తుందా? రాదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

చరణ్-తారక్

By

Published : Nov 21, 2019, 5:47 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. రామ్​చరణ్-ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలపై స్పష్టత వచ్చేసింది. తారక్​కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియో మోరిస్‌ నటిస్తోంది. ప్రతినాయకులుగా ఆంగ్ల నటులు రే స్టీవెన్‌సన్‌, ఎలీసన్‌ డూడీలు కనిపించబోతున్నారు. ఈ విషయాల్ని చిత్రబృందం.. బుధవారం ప్రకటించింది.

ఇదే సమయంలో చిత్రీకరణపై ఉన్న అనుమానాలను తొలగించారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు చెప్పారు. కానీ సినిమా విడుదల తేదీ మారుతోందంటూ వస్తున్న వార్తలపై మాత్రం స్పందించలేదు. ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఆర్.ఆర్.ఆర్ పోస్టర్​లో చరణ్-తారక్

ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎలాగూ మరో ఎనిమిది నెలల సమయం ఉంది. కాబట్టి ఈలోపు మిగిలిన చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేయడం పెద్ద విషయం కాదు. కానీ బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్​లో తేదీ చెప్పకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.

ఈ చిత్రాన్ని ఏకంగా పది భాషల్లో విడుదల చేయబోతున్నారని, 2020లోనే ఇది ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలియజేశారు. ఎలాగూ ఈ చిత్రాన్ని పది భాషల్లో విడుదల చేయబోతున్నారు కాబట్టి నిర్మాణాంతర కార్యక్రమాలు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇన్ని భాషల్లో విడుదల అంటే ప్రచార కార్యక్రమాలూ పెద్ద సవాలే. అందుకే అనుకున్న తేదీకి కాకుండా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. దీనిపై స్పష్టత రావాలి.

ఇది చదవండి: అంతర్జాతీయ స్టార్స్​తో 'ఆర్ఆర్ఆర్' హంగామా

ABOUT THE AUTHOR

...view details