RRR canada fans special video with cars: 'ఆర్ఆర్ఆర్'.. ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఈ పేరే వినిపిస్తోంది. దీని హంగామానే కనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడేకొద్ది.. సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు ప్రతిఒక్కరిలోనూ ఉత్కంఠ, ఆసక్తి పెరిగిపోతుంది. చిత్రం విజయవంతం అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అయితే కొంతమంది ఫ్యాన్స్ వినూత్న రూపంలో సినిమాకు సంబంధించిన వీడియోలను తమదైన స్టైల్లో అనుకరిస్తున్నారు. డిఫరెంట్ స్టైల్లో విషెస్ తెలుపుతున్నారు.
తాజాగా కెనడాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రవాసభారతీయులు అక్కడివారితో కలిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. కార్లతో ర్యాలీగా వెళ్లి.. 'ఆర్ఆర్ఆర్' ఆకృతిలో వాటిని అమర్చారు. దానికి సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు జోడించి.. 'తొక్కుకుంటూపోవాలే' అని క్యాప్షన్ జోడించారు. చిత్రం విజయవంతం కావాలని ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి సహా చిత్రబృందానికి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ వీడియోను మెచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వీడియోను సోషల్మీడియాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.