తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'స్పైడర్​మ్యాన్​' కలెక్షన్లను 'ఆర్​ఆర్​ఆర్'​ బ్రేక్​ చేస్తుంది!​: జక్కన్న - RRR overseas premiere collections

RRR breaks Spiderman collections: విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్'ను ఆదరించడంపై హర్షం వ్యక్తం చేశారు దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​. సినిమా గురించి ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అవన్నీ వారి మాటల్లనే..

RRR breaks Spiderman premiere collections
RRR breaks Spiderman premiere collections

By

Published : Mar 22, 2022, 10:53 PM IST

ఆర్​ఆర్​ఆర్​

RRR breaks Spiderman collections: ఉత్తర అమెరికాలోని ఓ లొకేషన్​లో 'స్పైడర్​మ్యాన్'​ సాధించిన ప్రీమియర్​ షోస్​ కలెక్షన్లను 'ఆర్​ఆర్​ఆర్' ​బ్రేక్​ చేయనుందన్నారు దర్శకుడు రాజమౌళి. ఈ విషయాన్ని అక్కడి ఓ డిస్ట్రిబ్యూటర్​ తనతో చెప్పారని పేర్కొన్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రమోషన్స్​లో భాగంగా ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'మీ రికార్డులను మీరే బ్రేక్​ చేసినప్పుడు ఎలా ఉంటుంది' అని అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు జక్కన్న.

"రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. సినిమా తీసేటప్పుడు, ప్రమోషన్​ చేసేటప్పుడు అస్సలు వీటి గురించి అలోచించను. రిలీజ్​ అయ్యాక రికార్డులు వస్తుంటే సహజంగానే హ్యాపీగా ఫీలవుతాను. అయితే నార్త్​ అమెరికాలోని ఒక లోకేషన్​లో ప్రీమియర్స్​ షోకు​ భారీగా కలెక్షన్స్​ రాబట్టింది​ ఇటీవల వచ్చిన 'స్పైడర్​మ్యాన్: నో వే హోమ్​'. దాన్ని మనం అధిగమించబోతున్నాం. ఈ విషయాన్ని అక్కడి మా డిస్ట్రిబ్యూటర్​ చెప్పారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది" అని రాజమౌళి అన్నారు.

దీంతోపాటే తెలుగు చిత్రాలను ఆదరిస్తున్న ఓవర్సీస్​ డిస్ట్రిబ్యూటర్స్​, ఆడియెన్స్​కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి, ఎన్టీఆర్​, రామ్​చరణ్​. ప్రతిఒక్కరూ సినిమాను బాగా ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ముగ్గురూ ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ సంగతులు మీకోసం..

యాంకర్​: ఈ సినిమా తీయడం కష్టమా? ప్రమోషన్స్​ చేయడం కష్టమా?

రాజమౌళి: రెండిటి వేరువేరుగా చూడట్లేదు. అలసట అనిపిస్తుంది కానీ కష్టం కాదు.

యాంకర్​: వీరిద్దరిని హ్యాండిల్​ చేయడం కష్టమా?

రాజమౌళి: చాలా చాలా కష్టం.

యాంకర్​: ఓవర్సీస్​లో తెలుగువారే కాకుండా మిగతా వారు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ ఫిల్మ్​ రిలీజ్​ అవుతున్న నేపథ్యంలో మీరు ఒత్తిడి గురవుతున్నారా?

రామ్​చరణ్​: ఓత్తిడిని అధిగమించాం. రిలీజ్​ రోజు కోసం, ఆడియెన్స్​ రియాక్షన్​ కోసం ఎదురుచూస్తున్నాం.

యాంకర్​: జనవరిలో రిలీజ్​ ప్రకటించినప్పుడు ఓవర్సీస్​లో చాలా టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ కరోనా వల్ల వాయిదా వేసినప్పుడు మీకెలా అనిపించింది?

రాజమౌళి: ఓవర్సీస్​లో ఊహించనంత స్థాయిలో బుకింగ్ అయిపోయాయి. కానీ ఇక్కడేమో కరోనా పెరిగిపోయింది. ఒక్కో రాష్ట్రంలో లాక్​డౌన్​ విధిస్తూ వస్తున్నారు. ఏమి చేయాలో తోచని పరిస్థితి. పోస్ట్​పోన్​ చేసి టికెట్​ డబ్బులు వెనక్కి ఇవ్వాలా? వద్దా? ఏమి చేయాలో అసలు అర్థం కాలేదు. రెండు రోజులు తలపట్టుకున్నాను. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియలేదు. ఇలా జరిగినందుకు డిస్ట్ట్రిబ్యూటర్స్​, ఆడియెన్స్​, ప్రతిఒక్కరికీ క్షమాపణలు.

తారక్​: పోస్ట్​పోన్​ చేసేశాం. మళ్లీ క్రేజ్​ వస్తదా అని చాలా భయం వేసింది. కానీ ఇప్పుడు చూస్తుంటే నేను ఆలోచించింది తప్పని అర్థమైంది.

యాంకర్​: ఓవర్సీస్​లో వినూత్నంగా ప్రమోషన్​ చేస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది?

రామ్​చరణ్​: ఆడియెన్స్​ ఎక్సైట్​మెంట్​ను రకారకాలుగా చూపిస్తుంటారు. దాన్ని చూసినప్పుడు నాకు కూడా ఎక్సైట్​మెంట్​ వస్తుంది.

రాజమౌళి: వీదేశాల్లో ఎప్పుడైనా తెలుగు సినిమా చూశారా?

తారక్​-చెర్రీ: ఎప్పుడూ చూడలేదు.

రాజమౌళి: నాకు చూడాలని ఆసక్తిగా ఉంది.

తారక్​: ఆడియెన్స్​ 'ఆర్​ఆర్​ఆర్'​ను తమ సొంత సినిమగా భావించి ప్రమోట్​ చేయడం ఆనందంగా ఉంది.

యాంకర్​: విదేశాల నుంచి ఏమైనా కాల్స్​ వచ్చాయా?

చరణ్​: లేదు. నాకు ఫ్రెండ్స్​ తక్కువ. అక్కడి అభిమానులు చేసే కార్యక్రమాలు చూస్తే చాలా ఆనందం వేసింది.

రాజమౌళి: థియేటర్లకు వచ్చిన ప్రతిఒక్కరూ 20 నిమిషాల్లోనే, హీరో ఇంట్రడక్షన్ సమయానికి సినిమాలో లీనమైపోతారు. 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఎమోషనల్​గా ఫీలవుతారు. సినిమా అయిపోయాక మళ్లీ చూడాలనుకుంటారు. ప్రజలు కథలోని ఎమోషన్స్​కు కనెక్ట్​ అవుతారు. సినిమాను, ఎన్టీఆర్​, రామ్​చరణ్​ అద్భుత ప్రదర్శనను బాగా ఆస్వాదించాలంటే.. 3డీ, డాల్బీ, ఐమాక్స్​లో సినిమాను చూడాలి. ముఖ్యంగా డాల్బీ విజన్​లో చూడటం చాలా ప్రత్యేకంగా, అద్భుతంగా ఉంటుంది. దాన్ని మాటల్లో చెప్పలేను. అందుకే దీన్ని డాల్బీలో కూడా రిలీజ్ చేస్తున్నాం.

యాంకర్​: ఓవర్సీస్​ ఆడియెన్స్ కోసం ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారా?

రాజమౌళి: ప్రతి షాట్​ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. పోస్ట్​పోన్​ జరగడం వల్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడానికి సమయం దొరికినట్టైంది.

మొత్తంగా 'ఆర్ఆర్ఆర్'.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ విడుదలకు ముందే ప్రభంజనం సృష్టిస్తోంది. అమెరికా సహా పలు దేశాల్లో సుమారు 1200 సెంటర్లలో విడుదలకానుంది. ప్రిమియర్స్ ద్వారా అదిరిపోయే వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశాల్లో అంత పెద్ద మొత్తంలో వసూలు చేయనున్న తెలుగు సినిమాగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు సృష్టిస్తుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: RRR movie: ఒక్క ఫొటో.. నాలుగేళ్ల ప్రయాణం.. సాగిందిలా

ABOUT THE AUTHOR

...view details