RRR Beats Baahubali 2 Record: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్'.. రిలీజ్‌కు ముందే భారతీయ చిత్రాల రికార్డ్లను తిరగరాస్తోంది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో ఈ చిత్రం ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. దీంతో 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్ అయ్యింది. ప్రీమియర్స్‌లో 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసింది 'బాహుబలి-2'.
అయితే 2.5మి. డాలర్లతో ఆగిపోలేదు 'ఆర్‌ఆర్‌ఆర్'. క్రమంగా 3మిలియన్ డాలర్ల వైపు పయనిస్తోంది. దీంతో మునుపెన్నడూ చూడని బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో నేడే (మార్చి 24) 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రీమియర్ షోలు వేయనున్నారు.