తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' ఆడియో హక్కులు ఎవరికంటే.. - టీ సిరీస్ ఆర్ఆర్ఆర్ ఆడియో హక్కులు

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఈ మూవీ ఆడియో హక్కుల్ని సొంతం చేసుకున్న కంపెనీలను ప్రకటించింది చిత్రబృందం.

RRR
ఆర్ఆర్ఆర్

By

Published : Jul 26, 2021, 7:58 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. మెగా పవర్​స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషనల్ సాంగ్ షూటింగ్​లో బిజీగా ఉంది చిత్రబృందం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్​ను సొంతం చేసుకున్నట్లు తెలిపాయి ప్రముఖ కంపెనీలు టీ-సిరీస్, లహరి మ్యూజిక్. హిందీతో పాటు దక్షిణాదికి చెందిన ఈ సినిమా ఆడియో హక్కుల్ని ఈ రెండు కంపెనీలు దక్కించుకున్నాయి. 'బాహుబలి' ఆడియో రైట్స్ కూడా వీరే సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్​ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరుతో వచ్చిన మేకింగ్ వీడియో అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇవీ చూడండి: 'తిమ్మరుసు' ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్​కు ఎన్టీఆర్ విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details