తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాజమౌళి.. ఇదేమీ బాగోలేదు: బోనీ కపూర్ - maidan

దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'మైదాన్‌' విడుదల తేదీలపై గత కొన్నిరోజుల నుంచి కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బోనీకపూర్‌ మరోసారి వివాదంపై నోరు విప్పారు.

rrr and maidaan clash boney kapoor accuses ss rajamouli of bullying
రాజమౌళి.. ఇదేమీ బాగోలేదు: బోణీ కపూర్

By

Published : Feb 13, 2021, 4:01 PM IST

ఒకనెలలో రెండు రోజుల వ్యవధిలో ఒకే హీరో నటించిన చిత్రాలను విడుదల చేయడం దురదృష్టకరమని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్​ అన్నారు. ఆయన నిర్మాణంలో అజయ్​ దేవ్​గణ్​​ నటించిన మైదాన్ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్​ఆర్​ఆర్​ విడుదలవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

'ఆర్​ఆర్​ఆర్​'లో అజయ్

'అనైతిక చర్య..'

" 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. నేను నిర్మాతగా వ్యవహరిస్తున్న 'మైదాన్‌'లో అజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గతేడాదిలోనే విడుదల చేయాలనుకున్నాం. అయితే కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. సినిమా కోసం మేం అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టాం. ఈ ఏడాదిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించిన సమయంలోనే అక్టోబర్‌ 15న 'మైదాన్‌' విడుదల చేస్తామని ప్రకటించాం. మా సినిమా విడుదల తేదీని ప్రకటించిన కొన్ని రోజులకే 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని అక్టోబర్‌ 13న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి, చిత్రబృందం తెలిపింది. ఒకే హీరోకు చెందిన రెండు భారీ ప్రాజెక్ట్‌లు కేవలం రెండు రోజుల తేడాతో విడుదల కావడం దురదృష్టకరం. ఇది అనైతికమైన చర్య" అని బోనీ కపూర్ అన్నారు.

'మైదాన్​'

'రాజమౌళి మాట నమ్మాలనుకోవడం లేదు'

"విడుదల తేదీల విషయమై ఇటీవల నేను రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడాను. విడుదల తేదీతో తనకు సంబంధం లేదని.. అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని ఆయన నాతో చెప్పారు. కానీ, ఆయన మాటల్ని నేను నమ్మాలనుకోవడం లేదు. నాకు తెలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల గురించి అజయ్‌కు కూడా ముందుగా సమాచారం ఇచ్చారనుకోవడం లేదు. ఇండస్ట్రీలో మంచి పేరున్న రాజమౌళి నుంచి నేను ఇలాంటి చర్య ఊహించలేదు" అని బోనీకపూర్‌ చెప్పారు.

'ఆర్ఆర్​ఆర్'

ABOUT THE AUTHOR

...view details