సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కు(sai dharam tej accident) జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్(rp patnaik) స్పందించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
'యాక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపైనా కేసు పెట్టాలి. దీని వల్ల నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని నా అభిప్రాయం' అని ఆర్పీ పట్నాయక్ పోస్టు పెట్టారు.
సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధిలో శుక్రవారం రాత్రి సాయిధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి(cable bridge in hyderabad) వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయారు. ప్రమాదంలో ఆయన కుడి కంటి పైభాగం, ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మాదాపూర్ ఏసీపీ ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని.. దాని వల్ల తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: