తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'స్టార్ల సృష్టికర్త' రోషన్​ తనేజా అస్తమయం - బాలీవుడ్ నట గురువు

బాలీవుడ్​లో ప్రముఖ నటులు నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ లాంటి ఎందరికో నటన నేర్పించిన రోషన్​ తనేజా మృతి చెందారు.

బాలీవుడ్ ప్రముఖ నట గురువు కన్నుమూత

By

Published : May 11, 2019, 4:25 PM IST

ప్రస్తుతం బాలీవుడ్ రాణిస్తున్న ఎందరో నటులకు గురువైన రోషన్ తనేజా(87) ముంబయిలో కన్నుమూశారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న నసీరుద్దీన్‌ షా, జయా బచ్చన్, షబానా అజ్మీ, శత్రుఘ్న సిన్హా, అనిల్‌ కపూర్‌ లాంటి హేమాహేమీలకు నటనలో ఓనమాలు నేర్చించింది ఆయనే.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోషన్​ తనేజా.. శుక్రవారం రాత్రి మరణించారని తనయుడు రోహిత్‌ తనేజా తెలిపాడు.

పుణెలోని ‘ఎఫ్‌టీఐఐ’లో ఫ్రొఫెసర్‌గా పనిచేశారు రోషన్‌. పదవీ విరమణ అనంతరం ముంబయిలో సొంతంగా యాక్టింగ్‌ స్కూల్‌ స్థాపించి ఎంతోమందిని నటీనటులను చిత్రసీమకు అందించారు. తనేజా మృతికి చిత్రసీమలోని ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపాన్ని తెలియజేశారు.

ట్విట్టర్​లో సంతాపం తెలిపిన ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details