తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోవాకు వెళ్లిన 'రొమాంటిక్' బృందం

ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'రొమాంటిక్'. తాజాగా చిత్రబృందం షూటింగ్​ కోసం గోవా వెళ్లింది. అక్కడ రమ్యకృష్ణతో పాటు మిగతా తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

రొమాంటిక్

By

Published : Nov 11, 2019, 12:51 PM IST

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్' చిత్రం తెరకెక్కుతోంది. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లింది. అక్కడ కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

ర‌మ్య‌కృష్ణ కూడా ఈ షెడ్యూల్​లో పాల్గొంటుంది. 30 రోజుల పాటు ఈ చిత్రీకరణ జరగనుంది. ఇప్పటికే ఫస్ట్​లుక్ విడుదల చేయగా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవీ చూడండి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ.. ఇంకా టైమ్ ఉంద‌ట‌..!

ABOUT THE AUTHOR

...view details