తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రొమాంటిక్ సాంగ్: "ఐ లవ్​ యూ".. సరదా తీరిపోద్ది

ఆకాశ్ పూరి, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమాలోని "నువ్వు నేను ఈ క్షణం" అనే పాట విడుదలైంది.

romantic
రొమాంటిక్

By

Published : Dec 21, 2019, 5:23 PM IST

'ఇస్మార్ట్ శంకర్‌' దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి కొత్తగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్‌'. అనిల్‌ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని "నువ్వునేను ఈ క్షణం" అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్​కు పూరి జగన్నాథ్​ సాహిత్యం అందించడం విశేషం. పాటలాగా కాకుండా కవితలాగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్​గా నటిస్తోంది. పూరి తెరకెక్కించే చిత్రాల్లోనూ, తనయుడు ఆకాష్‌ నటించే చిత్రంలోనూ ఎక్కువగా యువతే ప్రధాన పాత్రలుగా వస్తుంటాయి. ఈ సినిమాకు పూరితో పాటు ఛార్మి కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇవీ చూడండి.. అలా పోలీస్ పాత్ర ఓకే అయింది: బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details