తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కింగ్​ ఖాన్​ కార్ల ఖరీదెంతో తెలుసా? - షారుక్​ ఖాన్​ కార్లు ధర

​బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్​ ఖాన్​కు కార్లంటే విపరీతమైన ఇష్టం. మార్కెట్లోకి స్పెషల్​ మోడల్​ కారు ఏమైనా వస్తే వాటిని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన దగ్గర విలాసవంతమైన కార్లు చాలానే ఉన్నాయి. ఆ కార్లు ఏంటి, వాటి ధరలు ఎంత? విషయాల సమాహారమే ఈ కథనం.

sharukh
షారుక్​

By

Published : Mar 9, 2021, 5:41 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​ గ్యారేజీలో ఉండే కార్ల విలువ తెలుసా? అక్షరాలా రూ. 34 కోట్లు. నమ్మకం కలగడం లేదా? అయితే ఆయన గ్యారేజ్​లో ఉన్న కార్లు, వాటి ధరలపై ఓ లుక్కేద్దాం.

షారుక్​

బుగాటీ వేరాన్‌: ధర రూ: 12కోట్లు

ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకెళ్లే కార్లలో బుగాటీ వేరాన్‌ ముందువరుసలో ఉంటుంది. దీని డిజైన్‌, తయారీ అంతా జర్మనీలోనే. ఈ పంచకళ్యాణిపై మనసు పడి మరీ అక్కడి నుంచి తెప్పించాడు ఖాన్‌. తన అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేయించుకున్నాడు. ఇలాంటి కారు ఇండియా సెలబ్రిటీలలో షారూఖ్‌ ఒక్కడి దగ్గరే ఉంది.

బుగాటీ వేరాన్

రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ డ్రాప్‌హెడ్‌ కూపె: ధర రూ.10కోట్లు

అంతర్జాతీయ స్టార్లు ఇష్టపడే మోడల్‌ ఇది. కిమ్‌ కార్దాషియన్‌, డేవిడ్‌ బెక్‌హాం, జెన్నిఫర్‌ లోపెజ్‌లాంటి అంతర్జాతీయ స్టార్లు ఇష్టపడ్డ కారు ఇది. వాళ్లకన్నా నేనేం తక్కువ అనుకున్నాడేమో.. ఈ బ్రిటీష్‌ లగ్జరీ కారును సొంతం చేసేసుకున్నాడు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మన మెగాస్టార్‌ చిరంజీవి దగ్గర కూడా ఈ కారు ఉంది.

రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ డ్రాప్‌హెడ్‌ కూపె

బెంట్లే కాంటినెంటల్‌ జీటీ: ధర రూ: 5.2కోట్లు

మార్కెట్లో అందుబాటులో ఉన్న విలాసవంతమైన సెడాన్‌లలో ఇదొకటి. 4.0లీటర్ల వీ8 ట్విన్‌ టర్బో ఇంజిన్‌, 500 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. షారూఖ్‌ షూటింగ్‌కి వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఈ కారును వినియోగిస్తుంటాడు.

బెంట్లే కాంటినెంటల్‌

బీఎండబ్ల్యూ 18: ధర రూ: 2.29 కోట్లు

షారుక్​‌ తన భార్య గౌరీ ఖాన్‌ పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చిన బండి. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ కారు. సచిన్‌ తెందుల్కర్‌, శిల్పాశెట్టిలు సైతం ఈ కారును వినియోగిస్తున్నారు.

బీఎండబ్ల్యూ 18

బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ కన్వర్టిబుల్‌

బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి తను సొంతం చేసుకున్న మరో మోడల్‌ ఇది. ముంబయిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ కారులోనే చక్కర్లు కొడుతుంటాడు షారూఖ్‌. శక్తిమంతమైన 4.4 లీటర్ల వీ8 ట్విన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో పరుగెత్తుతుంది. ఐదు సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.

రేంజ్‌రోవర్‌ వోగ్‌: ధర రూ: 2కోట్లు

ఈ మోడల్‌ను బెస్ట్‌ ఎస్‌యూవీల్లో ఒకటిగా చెబుతుంటారు. దీన్ని నడిపిస్తూ చాలాసార్లు కెమెరాలకు చిక్కాడు షారూఖ్‌. దీని అత్యధిక వేగం గంటకు 250కిలోమీటర్ల పైనే.

హ్యుందాయ్‌ క్రెటా 2020: ధర రూ: 12 లక్షలు

షారూఖ్‌ హ్యుందాయ్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రచారం చేయడమే కాదు.. ప్రత్యక్షంగా ఆ కారును వినియోగించాలనే ఉద్దేశంతో ఖరీదు చేశాడు. హ్యుందాయ్‌ కంపెనీ క్రెటాని షారూఖ్‌కి బహుమతిగా ఇచ్చింది అంటుంటారు. - ఇవి కాకుండా ఖాన్‌ గ్యారేజీలో చిన్నాచితకావి మరో ఐదు కార్లున్నాయి.

ఇదీ చూడండి:షారుక్ బండి ఏదైనా.. '555' నెంబర్ ఉండాల్సిందే

ABOUT THE AUTHOR

...view details