జబర్దస్త్.. ఈ షో తెలియని తెలుగు లోగిళ్లు.. ఇది చూడని యువత లేరంటే అతిశయోక్తి కాదేమో! రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం సంపాదించిందీ షో. ఈ కార్యక్రమానికి జడ్జిగా ఉన్న ఎమ్మెల్యే రోజా జబర్దస్త్సభ్యులకు ఓ కానుక ఇచ్చారు.
దసరా సందర్భంగా హైపర్ ఆది, చలాకి చంటి, దొరబాబు తదితరులకు 'శ్రీపూర్ణిమ' అనే భక్తి గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు రోజా. ఈ గ్రంథాన్ని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రాశారు. ఈ పుస్తకాన్ని ఇచ్చినందకు రోజాకు ధన్యవాదాలు చెప్పింది జబర్దస్త్ టీమ్.