ఈసారి జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు(maa elections 2021) సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని సినీ నటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె 'మా' ఎన్నికలపై స్పందించారు. 'మా' ఎన్నికలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయని అన్నారు. అంతేకాకుండా తాను ఎవరికి ఓటు వేయనున్నారనే విషయాన్ని చెప్పారు.
"ఈసారి 'మా' ఎన్నికలు(maa elections 2021) ఎంతో హోరాహోరీగా సాగుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. లోకల్, నాన్ లోకల్ వివాదం గురించి నేను ఏం మాట్లాడాలనుకోవడం లేదు. రెండు ప్యానెల్స్ మేనిఫెస్టోలు చూశాను. అభివృద్ధి చేసే ప్యానెల్‌కే నా ఓటు వేస్తాను" అని రోజా అన్నారు.