తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇప్పటికీ శుక్రవారం అంటే నాకు భయమే' - సూర్యవంశీ

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు రోహిత్​శెట్టి.. 'సింగం' ఫ్రాంచైజీలో మూడో చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నాడు. ఈ విషయమై ఇటీవలే స్పష్టతనిచ్చాడు.

Rohit Shetty to return with 'Singham 3' post 'Sooryavanshi'
'ఇప్పటికీ శుక్రవారం అంటే భయమే'

By

Published : Feb 18, 2020, 10:01 PM IST

Updated : Mar 1, 2020, 6:55 PM IST

బాలీవుడ్ దర్శకుడు రోహిత్​శెట్టి.. అక్షయ్ కుమార్ హీరోగా 'సూర్యవంశీ' సినిమా తీస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ సాగుతోంది. కత్రినా కైఫ్​ హీరోయిన్​గా నటిస్తుంది. వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ రోహిత్​.. తన తర్వాతి ప్రాజెక్టు గురించి చెప్పాడు.

"దర్శకుడిగా ప్రేక్షకులకు ఎలాంటి చిత్రాలను అందిచాలన్న అవగాహన ఉంది. కానీ నా సినిమా విడుదలయ్యే ప్రతి శుక్రవారం భయంగానే ఉంటుంది. ఏది ఏమైనా కరెక్ట్​గా పని చేయడమే నాకు తెలుసు. 'సూర్యవంశీ' తర్వాత అజయ్​ దేవగణ్​తో 'సింగం' సిరీస్​లో మరో చిత్రం చేస్తున్నాను"

- రోహిత్​శెట్టి, బాలీవుడ్​ దర్శకుడు

ఇదే కాకుండా ఫరాఖాన్​ దర్శకురాలిగా 'సత్తే పే సత్తే' రీమేక్​ను​ నిర్మిస్తున్నాడు రోహిత్. 'కత్రోన్ కి కిలాడీ' టీవీ షో పదో సీజన్​కు సిద్ధమవుతున్నాడు.

ఇదీ చూడండి..'హే రామ్'​ కోసం​ ఒక్క రూపాయి తీసుకోని షారుక్

Last Updated : Mar 1, 2020, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details