సింబా దర్శకుడితో ఫరాఖాన్... - sharukh khan
దర్శకుడిగానే కాదు నిర్మాతగాను విజయాన్ని అందుకునేందుకు రోహిత్ శెట్టి సిద్ధమైపోయాడు.

సింబాతో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు రోహిత్ శెట్టి నుంచి మరో చిత్రం రాబోతుంది. కాకపోతే దర్శకత్వం వహించేది రోహిత్ కాదు. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ నటించే అవకాశముందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీతో తెరకెక్కునుందీ చిత్రం.
"విధి విచిత్రమైనది. మనం అనుకోనివి జరిగేలా చేస్తుంది. రోహిత్‌తో కలిసి పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతను "మదర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్" అంటూ పొగడ్తల వర్షం కురిపించింది ఫరాఖాన్...
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రోహిత్ శెట్టి పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.