టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌కు అవకాశమివ్వాలని అన్నాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. మూడు ఫార్మాట్లలోనూ సారథిగా ఉన్న కోహ్లీపై పని భారం ఎక్కువైతే ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.
"ఇంతకు ముందు వన్డే, టెస్టు రెండు ఫార్మాట్లే ఉండేవి. ఇప్పుడు టీ20లతో కలిపి మూడు. అన్నింటికీ కోహ్లీ కెప్టెన్‌గా ఉండటం వల్ల అతడిపై పనిభారం పెరిగే అవకాశం ఉంది. అందువల్ల మరో ఆటగాడికి టీ20 బాధ్యతలు అప్పగించడం మంచిది. పొట్టి ఫార్మాట్లో రోహిత్ విజయవంతమైన కెప్టెన్."
-యువరాజ్ సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఉన్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్లో విజయవంతమైన సారథిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ముంబయి ఇండియన్స్‌ను నాలుగు సార్లు విజేతగా నిలిపి రికార్డు సృష్టించాడు.
అదే విధంగా నాలుగో స్థానం గురించి స్పందించాడు యువరాజ్ సింగ్. ఆ స్థానం కోసం అనుభవం ఉన్న ఆటగాడిని ఎంపిక చేయాలని సూచించాడు.
"నాలుగో స్థానంలో ఎవరు బాగా ఆడతారో ముందు గుర్తించాలి. అతడిని ప్రోత్సహించాలి. ప్రపంచకప్‌లో ఆ స్థానంలో ఆడిన బ్యాట్స్‌మెన్ అత్యధిక స్కోర్ 48. నాలుగో స్థానం ముఖ్యమైందని కోచ్, సెలక్టర్లు, సారథి తెలుసుకోవాలి. ఇంగ్లాండ్‌లాంటి పిచ్‌లపై అది మరీ ముఖ్యం. ఒక ఆటగాడి నుంచి మంచి గేమ్‌ను వెలికితీయాలంటే అతడికి భద్రత కల్పించాలి. క్రికెటర్.. అభద్రతా భావంతో ఉంటే రాణించలేడు. టీమిండియా ప్రపంచకప్ గెలవకపోవడానికి కారణం ఇదే."
-యువరాజ్ సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్
నాలుగో స్థానంలో ఆడేందుకు సాంకేతికంగా బలంగా ఉండాలన్నాడు యువరాజ్. ఆ స్థానంలో విజయ్ శంకర్, రిషబ్ పంత్ విఫలమవడానికి కారణం అనుభవలేమి అని చెప్పాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్లోదినేశ్ కార్తిక్‌ను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు దించారని అందువల్ల ఆ నిర్ణయం కలిసి రాలేదని అన్నాడు.
ఇవీ చూడండి.. టీ20లో డుమిని విశ్వరూపం... యువీ రికార్డు పదిలం