కరోనా వల్ల నిలిచిపోయిన ప్రముఖ హాలీవుడ్ సినిమా 'ది బ్యాట్‌మాన్' చిత్రీకరణ పునఃప్రారంభంకానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌లో సెప్టెంబరు నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం. 2021 అక్టోబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి ప్రయత్నిస్తామని తెలిపింది.
ఈ చిత్రానికి మ్యాట్ రీవ్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతకుముందే 'లెట్ మీ ఇన్', 'డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్', 'వార్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' చిత్రాలను ఆయన తెరకెక్కించారు.