హలీవుడ్ నటుడు జేసన్ మొమోవా(ఆక్వామ్యాన్ ఫేమ్) ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాకింగ్ మర్చిపోక ముందే హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ ఇన్ స్టా ఎకౌంట్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. శుక్రవారం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు రాబర్ట్.
"నా ఇన్‌స్టా ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. తాత్కాలికంగా నిలిచిపోయినందుకు క్షమించండి. సమస్య పరిష్కారమయ్యేవరకు దూరంగా ఉండండి. ధన్యవాదాలు" -రాబర్ట్ డౌనీ జూనియర్, హాలీవుడ్ నటుడు.
'ఐరన్‌మ్యాన్' నటుడు ఇన్‌స్టా ఖాతాలోని పోస్ట్‌లు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ తదితర సమచారం ఉచితంగా ఇతరులకు షేర్ చేశారు హ్యాకర్లు. ఖాతాకు సంబంధించిన రికవరీ ఈమెయిల్‌ను మార్చారని చెప్పాడు రాబర్ట్. అయితే ఈ సమస్య శనివారానికి పరిష్కారమైందని తన ఇన్‌స్టాలో వెల్లడించాడు.