తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఐరన్​మ్యాన్​​: అప్పుడు అరెస్ట్.. ఇప్పుడు అవార్డు

డిస్నీ డీ23 ఎక్స్​పో-2019 అమెరికా కాలిఫోర్నియాలో జరిగింది. ఈ వేడుకలో ప్రఖ్యాత డిస్నీ లెజెండ్ పురస్కారాన్ని రాబర్ట్ డౌనీ జూనియర్ దక్కించుకున్నాడు. ఈ అవార్డు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

By

Published : Aug 24, 2019, 2:34 PM IST

Updated : Sep 28, 2019, 2:50 AM IST

ఐరన్​ మ్యాన్

రాబర్ట్​ డౌనీ జూనియర్.. ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. అదే ఐరన్​ మ్యాన్​ అంటే చాలామంది గుర్తుపట్టేస్తారు. తాజాగా అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన డిస్నీ డీ23 ఎక్స్​పో-2019లో ప్రతిష్టాత్మక డీస్నీ లెజెండ్ అవార్డును దక్కించుకున్నాడీ హీరో. మొదటిసారి డిస్నీల్యాండ్​కు వచ్చినపుడు అరెస్టు అయ్యానని, ఇప్పుడు అవార్డు తీసుకుంటున్నానని తన మనసులో మాట పంచుకున్నాడు.

"డిస్నీ లెజెండ్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మీతో ఓ విషయాన్ని పంచుకుందామనుకుంటున్నా. నేను మొదటిసారి డిస్నీల్యాండ్ వచ్చినపుడు అరెస్ట్ అయ్యాను. అనుమతి లేకుండా బోట్​లో పొగ తాగినందుకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో చాలా అవమానకరంగా అనిపించింది.. ఎంతో నిరుత్సాహపడ్డాను" -రాబర్ట్​డౌనీ జూనియర్, హాలీవుడ్ నటుడు.

ఐరన్​మ్యాన్​, అవెంజర్స్​ ఫిల్మ్​సిరీస్​తో రాబర్ట్​ ఎంతో గుర్తింపు పొందాడు. దశాబ్ద కాలంగా మార్వెల్​ సూపర్​హీరో పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించాడు.

ఈ గౌరవం దక్కడం తనకు మర్చిపోలేని బహుమతి అని తెలిపాడు రాబర్ట్​ డౌనీ జూనియర్. "ఫ్యాన్స్ అందరికి కృతజ్ఞతలు.. ఐ లవ్యూ 3000.. నేనే ఐరన్ మ్యాన్​" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

రాబర్ట్​ డౌనీ జూనియర్​తో పాటు ఐరన్​మ్యాన్, జంగిల్​బుక్​ దర్శకుడు జాన్ ఫేవరూ, జేమ్స్​ ఎరల్ జోన్స్​, ప్రముఖ గాయకురాలు క్రిస్టినా అగ్విలేరా తదితరులకు డిస్నీ లెజెండ్​ పురస్కారాలు దక్కాయి.

"నన్ను ఈ పురస్కారానికి ఎంపికచేసినందుకు కృతజ్ఞతలు. రాబోయే తరాల వారికి కూడా గుర్తుండిపోయే కథలతో, సాంకేతికతతో డిస్నీ మాయ చేసింది. విభిన్న కథలతో ముందుకొచ్చిన ఎంతో మందికి అవకాశం కల్పించింది. " -జాన్ ఫేవరూ, హాలీవుడ్ దర్శకుడు.

ఈ ఏడాది లయన్​కింగ్​ సినిమాతో ప్రేక్షకులని అలరించాడు జాన్. 1994లో వచ్చిన చిత్రాన్ని అదే పేరుతో లైవ్ యాక్షన్​గా రీమేక్​గా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇది చదవండి: 'మహాభారతం'లో ప్రభాస్​ ఈ పాత్ర చేస్తాడట..!

Last Updated : Sep 28, 2019, 2:50 AM IST

ABOUT THE AUTHOR

...view details