దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'(రణం రౌద్రం రుధిరం) సినిమాలో రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ పూర్తైంది. కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ రెండు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను ప్రారంభించే పనిలో ఉంది. 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్'(Roar of RRR) మేకింగ్ వీడియోను జులై 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
RRR: ప్రమోషన్స్ షురూ.. మేకింగ్ వీడియో ఎప్పుడంటే? - రాజమౌళి ఆర్ఆర్ఆర్
'ఆర్ఆర్ఆర్'(RRR) చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న క్రమంలో ప్రమోషన్స్‌ను ప్రారంభించే పనిలో పడింది దర్శకధీరుడు రాజమౌళి బృందం. ఈ సినిమా నుంచి 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్'(Roar of RRR) మేకింగ్ వీడియోను జులై 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan), కొమురం భీమ్‌గా తారక్(NTR) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'భీమ్ ఫర్ రామరాజు', 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి..RRR Movie: సినిమా విడుదల ఆరోజే ఎందుకు?