తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Roar of RRR: మేకింగ్​ వీడియో కుమ్మేసింది బాసూ! - రాజమౌళి ఆర్ఆర్ఆర్

'ఆర్​ఆర్​ఆర్​'(RRR) చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న క్రమంలో ప్రమోషన్స్​ను ప్రారంభించే పనిలో పడింది దర్శకధీరుడు రాజమౌళి బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి 'రోర్​ ఆఫ్​ ఆర్​ఆర్​ఆర్​'(Roar of RRR) మేకింగ్​ వీడియోను గురువారం విడుదల చేసింది.

ROAR OF RRR Making Video Released From RRR movie
Roar of RRR: మేకింగ్​ వీడియో కుమ్మేసింది బాసూ!

By

Published : Jul 15, 2021, 11:01 AM IST

Updated : Jul 15, 2021, 11:13 AM IST

సినీ ప్రియులకు 'ఆర్‌ఆర్‌ఆర్'(రణం రౌద్రం రుధిరం) చిత్రబృందం నుంచి సర్​ప్రైజ్​ వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్టును ఎలా చిత్రీకరించారో చూడాలనుకునే వాళ్లకు ఓ మేకింగ్​ వీడియో ద్వారా చూపించారు. 'రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌'(Roar of RRR) పేరుతో మేకింగ్‌ వీడియో గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. భారీ సెట్స్​తో పాటు కీరవాణి బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​తో ఈ వీడియో అదిరిపోయింది.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ దర్శనమివ్వనున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ నాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి అయ్యింది.

ఇదీ చూడండి..RRR: ప్రమోషన్స్​ షురూ.. మేకింగ్​ వీడియో ఎప్పుడంటే?

Last Updated : Jul 15, 2021, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details